చండ్రుగొండ, ఫిబ్రవరి 16: జాతీయ పార్టీలే వర్గీకరణ అంశంతో ఎస్సీలను కులాల పేరుతో విడదీస్తున్నాయని మాల మహానాడు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ ఆరోపించారు. బడుగు శంకర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన మాల మహానాడు చండ్రుగొండ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ న్యాయబద్ధంగా లేదని అన్నారు. షమీం అక్తర్ సేకరించిన షెడ్యూల్డ్ కులాల జనాభా వివరాలను ఎందుకు బహిరంగం చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్యంలో కులాల మధ్య జగడం పెడుతున్నారని రాబోయే రోజుల్లో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు అశ్వరావుపేట నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాసరి. రామారావు, మండల నాయకులు బేతి, నాగబాబు, అల్లి, నరేష్ బేతి, వంశీకృష్ణ, ఎలమందల, శేఖర్, బడుగు. కిషోర్, కొండా, వంశీ, బడుగు, ప్రదీప్, నందు నూరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.