మధిర, మే 01 : మధిర సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తినింపేలా ఉన్నాయని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి అన్నారు. మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వందనపు శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో గురువారం మధిర పట్టణంలోని ఆదరణ సేవా ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. మధిర సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడారు. పేదలను ఆదుకునేందుకు అంతా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మధిర సేవా సమితి అధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు, పౌర సమాచార సేవా కేంద్రం అధ్యక్షుడు మహంకాళి వెంకట శ్రీనివాసరావు, లింగంపల్లి అప్పారావు, సామినేని రామనాథం, చల్లా సత్యనారాయణ, కష్టాల సతీశ్, చెడే రామకోటేశ్వరరావు, కుంచం కృష్ణారావు, చలువాది కృష్ణమూర్తి (ఆర్టీసీ రిటైర్డ్), ఒట్టే సైదులు, గాలి ప్రసాద్, జల్లా రాధాకృష్ణమూర్తి, నేరెళ్ల శ్రీనివాసరావు, నకిరేకంటి గోవింద్ పాల్గొన్నారు.