మధిర, ఏప్రిల్ 17 : మధిర మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు గురువారం ఖమ్మం మార్కెట్‌ను సందర్శించారు. మధిర మార్కెట్ యార్డును రెగ్యులర్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు, వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ సెక్రటరీ కె.చంద్రశేఖర్, సూపర్ వైజర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ వై.హనుమంతరావు, సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులోని మిర్చి తదితర వాణిజ్య పంటల క్రయ, విక్రయాలను, అక్కడ ఉన్న రైతులు, కమీషన్‌దారులు, ట్రేడర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, యార్డ్ నిర్వహణను పరిశీలించారు.