ఎర్రుపాలెం, జూలై 1: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన ఎం.శారద పదోన్నతిపై వచ్చి ఎర్రుపాలెం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన శారద మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో మండల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు.