Lok adalat | రాజీ మార్గమే సమాజానికి మార్గదర్శకం :జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్..

ఖమ్మం:సంక్లిష్టమైన ప్రస్తుత సమాజంలో రాజీ మార్గమే మార్గదర్శకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. ఇటువంటి రాజీ మార్గంలో నడచిన వారే సమాజానికి మార్గ దర్శకులని వారు అభినందనీయులని అన్నారు. శనివారం న్యాయమూర్తి న్యాయసేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కుటుంబం విచ్చిన్నం కావడంతో కుటుంబంలో కలతలు పెరిగాయన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు చూపిస్తాడని, కోర్టు కేసుల పెండింగ్ సమస్యకు లోక్ అదాలత్ పరిష్కారమని న్యాయమూర్తి వివరించారు.
కక్షిదారులు ఒక్క అడుగు రాజీ దిశగా ప్రయత్నం చేస్తే ప్రతివాదులు రెండు అడుగులు వేసే అవకాశం వుందన్నారు. అహం వీడి అందరూ ప్రవర్తిస్తే రాజీ తో సమాజం సుఖవంతమవు తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షడు మలీదు నాగేశ్వరరావు, న్యాయమూర్తులు కె.అరుణా కుమారి, అఫ్రోజ్ అక్తర్, ఆర్,డేనీరూత్, ఎం.శ్యాంశ్రీ, జి.శ్రీనివాస్, ఎన్.శాంతిసోని, పి.మౌనిక, ఎన్ .హైమ పూజిత, ఈ.భారతి,జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఏ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

