మధిర, అక్టోబర్19: ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని, జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు అన్నారు. గురువారం ఆయన మధిర పట్టణంలో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి పట్టణవాసులను ఓట్లు అభ్యర్థించారు. తాను ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వందలాది కోట్లు విడుదలయ్యేలా పనిచేశానని గుర్తుచేశారు. తన కృషితోనే పట్టణానికి వంద పడకల ఆసుపత్రి, వెజ్‌నాన్‌వెజ్ మార్కెట్లు, ఇండోర్ స్టేడియం, ట్యాంక్‌బండ్ అందుబాటులోకి వచ్చాయన్నారు.
అనంతరం బీఆర్ఎస్లో చేరిన మాజీ కౌన్సిలర్ తాండ్ర తిరుమలరావుతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, నాయకులు శీలం వెంకటరెడ్డి, బిక్కి కృష్ణప్రసాద్, గద్దల మాధురి, కనుమూరి వెంకటేశ్వరరావు, పల్లపోతుల వెంకటేశ్వరరావు, కపిలవాయి జగన్మోహన్రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.