ముదిగొండ, ఫిబ్రవరి 28: బీఆర్ఎస్ శ్రేణులకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తుందని అన్నారు. అందుకోసమే కార్యకర్తలకు రక్షణ కవచంలా బీమా సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. ముదిగొండలో మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పార్టీ కార్యకర్తలకు మంజూరైన బీమా చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త షేక్ మీరా సాహెబ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చెప్పారు. అప్పటీకే పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న మీరా సాహెబ్‌కు పార్టీ ప్రమాదబీమా కింద రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైనట్లు చెప్పారు. కాగా, ఈ మొత్తాన్ని మృతుడి నివాసంలో అతడి కుటుంబసభ్యులకు అందజేశారు. అనంతరం మేడేపల్లిలో మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌ను పరామర్శించారు. హరిప్రసాద్ సతీమణి ఇటీవల మరణించినందున శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటి, మందరపు ఎర్ర వెంకన్న, సిల్వరాజు, ఉపేదంర్, శ్రీను, తోట ధర్మారావు, పోట్ల ప్రసాద్, పణితి నర్సింహారావు, నాగయ్య, బత్తుల వెంకట్రావు పాల్గొన్నారు.