చింతకాని, జూన్ 15: పోరాడి సాధించుకున్న తెలంగాణలో పల్లెలకు పట్టం కట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. పల్లెలను సమగ్రాభివృద్ధి చేసి బంగారు తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గ్రామాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయడం ద్వారానే పల్లెలన్నీ సంపూర్ణాభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా చింతకాని పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో వారు మాట్లాడారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని పల్లెల కంటే తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలే అత్యధికంగా జాతీయ పురస్కారాలు సాధిస్తున్నాయని గుర్తుచేశారు.
ఇదే సభలో పారిశుధ్య కార్మికులను, ఐకేపీ, ఆరోగ్య సిబ్బందిని సన్మానించారు. అనంతరం రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న నరసింహాపురం పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్ధాపన చేశారు. చివరగా తిర్లాపురంలో రూ.3.5 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనాలకు శంకుస్ధాపన చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు బండి సుభద్ర, బండి రమాదేవి, దొడ్డా ప్రవీణ, తిరుపతికిశోర్, కోపూరి పూర్ణయ్య, పెంట్యాల పుల్లయ్య, మంగీలాల్, రవీంద్రప్రసాద్, నాగయ్య, షేక్ సైదులు, మరీదు రాధిక, నున్నా ధనలక్ష్మి, మంకెన రమేశ్, గడ్డం శ్రీను, వేముల నర్సయ్య, బండి రామారావు, వెంకటలచ్చయ్య, కిలారు వేణుగోపాల్, సిలివేరు సైదులు తదితరులు పాల్గొన్నారు.