కారేపల్లి, ఆగస్టు 28 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జడల వెంకటేశ్వర్లు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. కారేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన జడల వెంకటేశ్వర్లు సంతాప సభకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబుతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు హాజరై జడల వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.