కారేపల్లి, ఆగస్టు 05 : దసరా పండుగ సందర్బంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి అలయ ప్రాంగణంలో నిర్వహించే జాతరలో కొబ్బరికాయల అమ్మకానికి ఈనెల 7న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈఓ కొండకింది వేణుగోపాలాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ వరకు 11 రోజులు పాటు జరిగే జాతరలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్మకాలకు గత నెల 17, 28 తేదీల్లో వేలం పాటలు నిర్వహించగా పాటదారులు ముందుకు రాలేదన్నారు. దీంతో కొబ్బరికాయల వేలం వాయిదా పడింది. దీనికి సంబంధించి ఈ నెల 7న వేలం పాట నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.