కారేపల్లి, మార్చి 31 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయ పవిత్ర బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఎం.వీరస్వామి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిరోజు ఇల్లందు పట్టణానికి చెందిన మార్గదర్శిని విద్యాసంస్థల యాజమాన్యం భక్తులకు అన్న వితరణ చేసింది.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి వేణుగోపాల చార్యులు, సిబ్బంది పగడాల మోహనకృష్ణ, పర్స లలిత సాయి, అన్నదాతలు కడవెండి వేణుగోపాల్ గుప్తా, అర్వపల్లి రాధాకృష్ణ, తాటిపల్లి సుబ్బారావు, వ్యామసాని జనార్దన్ రావు, ఎలుగూరి మధుబాబు, గందె సురేశ్, కొల్లూరు సతీశ్, సైఫా రాజశేఖర్, చందా చక్రధర్, భువనగిరి రవి, కిరణ్ పాల్గొన్నారు.
Karepalli : ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం