కారేపల్లి, మార్చి 28 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుండి నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు, దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి వేణుగోపాలచార్యులు శుక్రవారం తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఇల్లెందు పట్టణానికి చెందిన మార్గదర్శిని విద్యాసంస్థల యాజమాన్యం, రెండో రోజు కాకతీయ స్కూల్ యాజమాన్యం, మూడో సింగరేణి మర్చంట్ అసోసియేషన్ సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.