ఖమ్మం, డిసెంబర్ 28: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆవిష్కరించారు. బుధవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కమిషనర్ ఆదర్శ్‌సురభి, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు, డీఈ ధరణి తదితరులు పాల్గొన్నారు.