ఖమ్మం, జనవరి 20: ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించిన బీఆర్ఎస్ సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మతోన్మాద శక్తులకు తావు లేదని నిరూపణ అయిందని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరా జు, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్ అన్నారు. సభకు హాజరై సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఖమ్మంలోని మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో వా రు మాట్లాడారు. సభలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధులు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
మున్నేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు ప్రకటించడం, మరుసటి రోజే పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని అన్నారు. అలాగే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, మూడు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు, 5 మేజర్ పంచాయతీలకు రూ.50 కోట్లతోపాటు జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. ఖ మ్మం సభకు మొత్తం 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచే లక్ష మంది హాజరయ్యారని అన్నారు. ఇంకా లక్షలాది మంది ప్రజలు సభ వద్దకు చేరుకోలేక రోడ్లపైనే ఉండిపోయారని అన్నారు. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో నూతన కలిగిందని, ఇదే స్ఫూర్తితో మన్ముందూ పనిచేస్తామని అన్నారు. ముందుండి సభను నడిపించిన మంత్రులు హరీశ్‌రావు, అజయ్, ఎంపీలు నామా, వద్దిరాజు, పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా, తాతా మధు సహా ఇతర నేతలకు, సహకరించిన అధికారులకు పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎష్ నాయకులు లక్ష్మీప్రసన్న, కమర్తపు మురళి, తోట రామారావు, ఆష్రిఫ్, షకీనా, తొగరు భాస్కర్, ఇషాక్ తదితరుల పాల్గొన్నారు.