బోనకల్లు, మార్చి 24: కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మండలంలోని నారాయణపురంలో గురువారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఒకే దేశం ఒకే కొనుగోలు విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరిచి కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలకే నిధులు కేటాయిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేయడానికి కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన కేంద్రం చేతులెత్తేయడం సరి కాదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్న కేంద్రం చివరికి ఎఫ్‌సీఐ గోదాములను విక్రయించడానికి వెనుకాడబోదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీ ప్రభుత్వ కుటిలత్వాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ నెల 31 వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, ఎంపీపీలు మెండెం లలిత, దేవరకొండ శిరీష, సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీలు పసుపులేటి దుర్గ, తిరుపతి కిశోర్, శీలం కవిత, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, పెంట్యాల పుల్లయ్య, రావూరి శ్రీనివాసరావు, పంబి సాంబశివరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు వేమూరి ప్రసాద్, చావా వేణు, కిలారు మనోహర్, పోట్ల ప్రసాద్, ములకలపల్లి వినయ్, మందడపు తిరుమలరావు, మంకెన రమేశ్, చుంచు విజయ్, శ్రీనివాసరావు, బంకా మల్లయ్య, బానోతు కొండా, సూర్యదేవర సుధాకర్, కరివేద సుధాకర్, గద్దల వెంకటేశ్వర్లు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, చావా రామకృష్ణ, చిలక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.