కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 8 : సింగరేణి సంస్థ 2022- 23 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ఉత్పత్తి చేస్తూ ముందుకెళ్తున్నది. ఈ ఏడాది అధిక వర్షపాతం ఉన్నా.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ దిశా నిర్దేశంతో డైరెక్టర్ల సూచనలతో జీఎంల పర్యవేక్షణతో అధికారులు, కార్మికులు సమష్టి కృషి చేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు పక్కా ప్రణాళికతో ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 99 శాతం బొగ్గు ఉత్పత్తి చేసి లక్ష్యానికి చేరువగా ఉన్నారు. వర్షాకాలం ముగుస్తున్న తరుణంలో మిగిలిన ఆర్నెళ్ల కాలంలో లక్ష్యాన్ని అధిగమించేలా బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు 11 ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి చేసిన వివరాలు ఇలా ఉన్నాయి..
కొత్తగూడెం ఏరియాలో 59,97,679 టన్నులకు గాను 54,02,852 టన్నులు (90 శాతం), ఇల్లెందు ఏరియాలో 22,60,127 టన్నులకు గాను 21,80,440 టన్నులు (96 శాతం), మణుగూరు ఏరియాలో 54,02,734 టన్నులకు గాను 55,18,242 టన్నులు (102 శాతం), ఆర్జీ1 ఏరియాలో 17,30,613 టన్నులకు గాను 19,21,861 టన్నులు (111 శాతం), ఆర్జీ2 ఏరియాలో 40,32,454 టన్నులకు గాను 39,56,921 టన్నులు (98శాతం), ఆర్జీ3 ఏరియాలో 25,54,167 టన్నులకు గాను 24,81,591 టన్నులు (97 శాతం), భూపాలపల్లి ఏరియాలో 19,70,417 టన్నులకు గాను 11,33,476 టన్నులు (58 శాతం), అడ్రియాలా ప్రాజెక్టులో 10,66,938 టన్నులకు గాను 6,66,728 టన్నులు (62 శాతం), బెల్లంపల్లి ఏరియాలో 16,34,375 టన్నులకు గాను 12,54,065 టన్నులు (77 శాతం), మందమర్రి ఏరియాలో 23,28,650 టన్నులకు గాను 17,72,669 టన్నులు (76 శాతం), శ్రీరాంపూర్ ఏరియాలో 30,84,771 టన్నులకు గాను 31,08,942 టన్నులు (101 శాతం) బొగ్గు ఉత్పత్తి జరిగింది. మొత్తం 320,754,23 మిలియన్ టన్నులకు గాను 293,977,87 మిలియన్ టన్నులు (92 శాతం) బొగ్గు ఉత్పత్తి సాధించారు. మిగిలిన ఆర్నెళ్ల కాలంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.