దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వెళితే కచ్చితంగా విజయం సాధించగలరు. కేంద్రంలోని బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నది. రాష్ట్రంలో పాగా వేయాలని కుయుక్తులు పన్నుతున్నది. కానీ కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలకు కాషాయ నేతల ఓటమి తప్పదు.
– బానోత్ ప్రియాంక, సర్పంచ్, దాస్తండా, టేకులపల్లి మండలం
ఇప్పుడు దేశానికి అన్నిరంగాలపై సంపూర్ణ విజన్ ఉన్న కేసీఆర్ అవసరం ఉంది. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీని తరిమికొట్టగలిగే రాజకీయ చతురత ఆయనకున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఆయనకే ఉంది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ మాత్రమే గాడిలో పెట్టగలరు. ఎనిమిదేళ్లలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేసినట్లే భారత్‌నూ రోల్‌మోడల్‌గా నిలుపగలరు. ఆయనకు ప్రజల మద్దతు ఉంటుంది.
– పూనెం నాగేశ్వరరావు, సర్పంచ్, శ్రీనగర్ కాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరినామం. ఆయన పాలనలో దేశ సుభిక్షంగా మారుతుంది. కేంద్రంలో బీజేపీ ఒంటెద్దు పోకడలు పోతున్నది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించింది. వ్యవసాయ రంగం కుదేలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం. జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా విజయం సాధించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు.
– రామటెంకి పూర్ణచంద్రశేఖర్‌రావు, రైతు, చొప్పాల, కరకగూడెం మండలం
కేంద్రంలోని బీజేపీ దేశంలో అరాచక పాలన సాగిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసింది. కేసీఆర్ వంటి బలమైన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళితే తప్పకుండా విజయం సాధిస్తారు. ప్రధాని అవుతారు. ఆయన విజన్‌తోనే దేశ భవిష్యత్తు మారనున్నది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. దేశాన్ని ఇతర దేశాలకు రోల్ మోడల్‌గా నిలుపగల సమర్థత ఉన్న నాయకుడాయన. ప్రతిఒక్కరూ కేసీఆర్‌కు మద్దతు పలకాలి.
– రావుల సోమయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, కరకగూడెం
సీఎం కేసీఆర్ గిరిజనులు, ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. హైదరాబాద్‌లో గిరిజన భవన్ నిర్మించారు. ఎస్టీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. వారికి 10 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని ఇటీవల ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్టీలకు మేలు జరుగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. పోడు సమస్యలకు పరిష్కారం చూపాలి. ఆయనకు ఎస్టీల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.
– బోడ మంగీలాల్, ఎంపీపీ, తిరుమలాయపాలెం
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేసీఆర్ కీలక భూమిక పోషించడం ఖాయం. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం తపన పడే కేసీఆర్‌తోనే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఎనిమిదేళ్లలో అభివృద్ధి బాట పట్టించారు. సబ్బండ వర్గాలు సంతోషపడేలా పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాంటి సమర్థత ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశ గతి మారుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకు చెందిన ప్రజలు సైతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఆయనకు యావత్ దేశ ప్రజలు మద్దతు పలుకుతారు.
– గోసు మధు, ఎంపీపీ, కొణిజర్ల
రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికి రోల్ మోడల్ చేశారు. అలాంటి పాలన ఇప్పుడు దేశానికి అవసరం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి. రాజకీయాల్లో కేసీఆర్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. అనేక భాషలపై పట్టు ఉంది. బీజేపీని ఢీకొట్టే ధీశాలి ఆయన. ఆయన నాయకత్వంపై దేశప్రజలందరికీ నమ్మకం ఉంది. కేసీఆర్‌తోనే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుంది. వ్యవసాయ రంగానికి ఊపిరి వస్తుంది. రైతులకు మేలు జరుగుతుంది.
– కోరం ఉమ, సర్పంచ్, కోయగూడెం, టేకులపల్లి మండలం