మామిళ్లగూడెం, సెప్టెంబర్ 15: రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని నాలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఈ నెల 18న పౌర సన్మానం చేయాలని వివిధ సంఘాల బాధ్యులు నిర్ణయించినట్లు ప్రజా సంఘాల పౌర సన్మాన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఖమ్మం లేక్‌వ్యూ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు షేక్ అఫ్జల్‌హసన్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, పొన్నం వెంకటేశ్వర్లు, కురువెళ్ల ప్రవీణ్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి.. ‘అజయ్‌కు ముందు.. అజయ్ తరువాత..’ అన్నట్లుగా ఉందన్నారు.
ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారని, జిల్లా రూపు రేఖలు మార్చిన ఘనత మంత్రి అజయ్కుమాదేనని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయేతర పక్షాలైన ప్రజా, పౌర, స్వచ్ఛంద, వ్యాపార, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న మంత్రికి ఘనంగా పౌర సన్మానం చేయనున్నట్లు చెప్పారు. 18న ఉదయం 11:30 గంటలకు గాంధీచౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నుంచి వైరా రోడ్డు, ఎన్టీఆర్ సరిల్ మీదుగా బైపాస్ రోడ్ సప్తపది ఫంక్షన్ హాల్ వరకూ 300 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల బాధ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కొప్పు నరేశ్‌కుమార్, గోడవర్తి శ్రీనివాసరావు, కురువెళ్ల ప్రవీణ్, గుమ్మడిల్లి శ్రీనివాస్, గోళ్ల రాధాకృష్ణ, అమరాగాని వెంకన్న, అల్లంపాటి వెంకటేశ్వరరెడ్డి, వేములపల్లి వెంకటేశ్వర్లు, ఆర్వీఎస్ సాగర్, శ్రీనివాస్‌రెడ్డి, మోతుకూరి మధు, రాజేశ్, నందగిరి శ్రీను, హకీమ్, లింగయ్య పాల్గొన్నారు.