మణుగూరు టౌన్, సెప్టెంబర్ 10 : దళితుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆయన దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ పథకంతో దళితులు మున్ముందు మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తారని అన్నారు. నియోజకవర్గ మొదటి విడత 100 మంది లబ్ధిదారులు, టీఆర్ఎస్ అన్ని మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, దళితులతో మణుగూరు అశోక్‌నగర్‌లోని గిరిజన భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.10 లక్షల సాయంతో వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. సమావేశానికి ముందుగా లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వ విప్ రేగా.. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, వెన్న అశోక్‌కుమార్, తోకల రమణ, తడికమళ్ల ప్రభుదాస్, ముత్యం బాబు, రావుల సోమయ్య, పగడాల సతీశ్‌రెడ్డి, కోడి అమరేందర్, గోపిరెడ్డి రమణారెడ్డి, అడపా అప్పారావు, తెల్లం భాస్కర్, పాయం నర్సింహారావు పాల్గొన్నారు.
లబ్ధిదారుడికి యూనిట్ అందజేత
కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నిట్ట ప్రభాకర్‌కు రూ.10 లక్షల దళితబంధు సాయంతో మంజూరైన వాహనాన్ని రేగా కాంతారావు మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలోఅందజేశారు.
మొదటి నెల కిరాయి..
టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణకు దళితబంధు ద్వారా మంజూరైన వాహనాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నెలరోజుల క్రితం తన కాన్వాయ్‌లో కిరాయికి పెట్టుకున్నారు. దాని మొదటి నెల కిరాయి రూ.20 వేలను తన క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారుడికి రేగా కాంతారావు అందజేశారు.