బూర్గంపహాడ్/ కరకగూడెం, సెప్టెంబర్ 7: బూర్గంపహాడ్ మండలానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సర్పంచ్‌లు సహా 50 కుటుంబాల వారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. బూర్గంపహాడ్ మండలం వేపలగడ్డ సర్పంచ్ కుంజా చిన్నబ్బాయి, కృష్ణసాగర్ సర్పంచ్ కొడిమె వెంకటేశ్వర్లు, వేపలగడ్డ పీసా అధ్యక్షుడు మెండి భాస్కర్, వార్డుసభ్యులు ఎస్కే దస్తగిరి, కుంజా రాంచంద్లతోపాటు నకిరిపేట పంచాయతీ నుంచి 50 కుటుంబాల వారు గులాబీ గూటికి చేరారు. కరకగూడెం మండలంలో నూతనంగా ప్రారంభించిన టీఆర్ఎస్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వీరందరికీ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలకు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలవారంతా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, జక్కం సుబ్రహ్మణ్యం, ఏసోబు, బెజ్జంకి కనకాచారి, కొనకంచి శ్రీను, అంజనేయులు, బాలి శ్రీహరి, పోతిరెడ్డి గోవిందరెడ్డి, తోటమళ్ల సరిత, బిట్రా సాయిబాబు, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, పూర్ణ, గాదె నర్సిరెడ్డి, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.