కరకగూడెం, సెప్టెంబర్ 7: దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన పది మందికి దళితబంధు పథకంలో మంజూరైన యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రికార్డుస్థ్ధాయిలో దళితబంధు పథకం అమలు చేశామని, ప్రభుత్వం ప్రతి దళిత కు టుంబానికి పథ కం వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. సాయం పొందిన ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదిగి సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలన్నారు. ఎంపీపీ రేగా కాళీక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, సర్పంచ్‌లు, నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డీఆర్ డిపోను ప్రారంభించిన విప్ రేగా
మండల కేంద్రంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 10లక్షలతో నిర్మించిన నిత్యావసర వస్తువుల విక్రయశాల (డీఆర్‌డిపో) కేం ద్రాన్ని బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పలు కుటుంబాలకు విప్ రేగా పరామర్శ
కరకగూడెం, సెప్టెంబర్ 7: మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలను బుధవారం విప్ రేగా పరామర్శించారు. చొప్పాల గ్రామానికి చెందిన గోగు లక్ష్మయ్య పూరిల్లు ఇటీవల వర్షాలకు కూలిపోయింది. విషయం తెలుసుకున్న విప్ రేగా బాధితుడిని పరామర్శించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.10 వేలు సాయం అందజేశారు. గొల్లగూడెంలో పాయం గౌరమ్మ ఇటీవల మృతిచెందింది. వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇర్ప రామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులను పరార్శించారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ విప్ రేగాను కలిసిన మణుగూరు డీఎస్పీ
కరకగూడెం, సెప్టెంబర్ 7: ఇటీవల మణుగూరు పట్టణంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కేవీ రాఘవేందర్ బుధవారం మండల కేంద్రంలో విప్ రేగా కాంతారావును మర్యాదపూర్వకంగా కలిశారు. రేగాకు పుష్పగుచ్ఛం అందజేసి పట్టణంలో చేపడుతున్న రక్షణ చర్యలపై వివరించారు. నూతన డీఎస్పీకి రేగా శుభాకాంక్షలు తెలిపారు.
కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ
మణుగూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కేవీ రాఘవేందర్ బుధవారం కరకగూడెం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. ఏడూళ్ల బయ్యారం సర్కిల్ సీఐ రాజగోపాల్, ఎస్ఐ, పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.