మణుగూరు టౌన్, సెప్టెంబర్ 7: మండల పరిధిలోని రామానుజవరం పంచాయతీలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను పుచ్చా రమణారెడ్డి రూ.57వేలు, కొట్టి రమేశ్ రూ.24 వేలు, సాధిన శంకర్ రూ.9500, సీహెచ్.లక్ష్మి రూ.13వేలు, పెద్ద నాగమణి రూ.14వేలు, బండి శ్రీను రూ.60వేలను జడ్పీటీసీ పోశం నర్సింహారావు పంపిణీ చేశారు. ఎంపీపీ కారం విజయకుమారి, మండల అధ్యక్షుడు ముత్యం బాబు, కార్యదర్శి రామిడి రామిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అడపా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ప్రభుదాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగారపు రమేశ్, ప్రధాన కార్యదర్శి కట్టా రాజ్‌కుమార్, నాయకులు బోయిల రాజు, పాకాల రమాదేవి, డి.రమాదేవి పాల్గొన్నారు.