నెట్వర్క్;‘మాతృదేవో భవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ’ అనే శ్లోకం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో సోమవారం మార్మోగింది.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు జరిగాయి.. విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారం ఎత్తి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.. సాంస్కృతిక ప్రదర్శన లతో అలరించారు.. పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులను సన్మానించారు.. ముఖ్య అతిథులు, వక్తలు దేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.. కొత్తగూడెంలో భద్రాద్రి కలెక్టర్, ఖమ్మంలో ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్ రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళి అర్పించారు.