కల్లూరు, సెప్టెంబర్ 5: ‘స్వచ్ఛ గురుకులం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా ఏడు రోజులపాటు చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రత, వాటర్‌ట్యాంకుల క్లీనింగ్, ప్లాంటేషన్‌తోపాటు కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర సౌకర్యాలతో విద్య నేర్చుకున్నామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను అధునాతనంగా నిర్మించి మెరుగైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ప్రభుత్వం 120 గురుకులాలను మంజూరు చేసిందని గుర్తుచేశారు. బీరవల్లి రఘు, కట్టా అజయ్‌బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణ్‌రావు, ఖమ్మంపాటి శారద, ప్రిన్సిపాల్ శ్రీలత, రఘు కల్యాణి, ప్రసన్న, సంగీత, అధ్యాపకులు పాల్గొన్నారు.