ఎర్రుపాలెం, సెప్టెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాల వల్లే వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజలు ఆకర్షితులై పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మండలంలోని పెగళ్లపాడులో ఆదివారం టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీల నుంచి 30 కుటుంబాల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ జడ్పీచైర్మన్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలను ఆదుకునే విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు చూరగొన్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధితో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా కనుమరుగవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి అవ్వా తాత, రైతు, మహిళ, యువతీ యువకులు, విద్యార్థులు ప్రతిఒక్కరికీ ఆర్థిక చేయూత అందేవిధంగా పెద్దఎత్తున పథకాలను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మున్ముందు ఇంకా మరెన్నో పథకాలు ప్రవేశపెడతారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గతంలో కంటే అత్యధికస్థానాలు గెలుచుకోవడం ఖాయమనే ధీమా ఆయన వ్యక్తం చేశారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండి అన్నివిధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్‌బాబు, మండల యూత్ అధ్యక్షుడు కొండేపాటి సాంబశివరావు, నాయకులు సూరానేని రామకోటేశ్వరరావు, బాలరాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గూడూరు నరసింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శివాజీ, కృష్ణారెడ్డి, పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.