భద్రాచలం, సెప్టెంబర్ 4: మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరద ముంపునకు గురైన 2,016కుటుంబాలకు రూ.వెయ్యి కోట్లతో ఎత్తైన ప్రదేశంలో కాలనీలు నిర్మిస్తామని తీర్మానం చేశారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, ముంపు బాధితులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో 100మంది దళితులకు ‘దళిత బంధు’ పథకం వచ్చిందని, నేడు 500మందికి దళిత బంధు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, నాయకులు తిప్పన సిద్ధులు, కోటగిరి ప్రభోథ్కుమార్, రత్నం రమాకాంత్, నర్రా రాము, భూక్యా శ్వేత, చుక్కా సుధాకర్, విజయ్ పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, సెప్టెంబరు 4: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దళితులకు రెండోవ విడత ప్రతి నియోజకవర్గానికి 500 కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరులోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సీ సెల్ విభాగం పట్టణ, మండల అధ్యక్షులు సంజీవరావు, గంగారపు రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ నాయకుడు ప్రభుదాస్ మాట్లాడారు. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ దళితుల పాలిట దైవమన్నారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు కట్టా రాజ్‌కుమార్, గుర్రం సృజన్, బండ్ల సురేశ్, పువ్వుల ప్రసాద్, సుజాత, జ్యోతి పాల్గొన్నారు.
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మణుగూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సకిని బాబూరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి గిరిజనుల పోడు భూములు సాగుచేస్తున్నారని, వారికి పట్టాలు ఇచ్చేలా సీఎం కేసీఆర్ క్యాబినెట్లో తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు చందా హరికృష్ణ, కుంజా రంగయ్య, ఎం సతీశ్, కే విజయ్, ఏనిక లక్ష్మయ్య, చిట్టెయ్య, ఏనిక సారయ్య, ముసలయ్య, మహిళా నాయకులు దారావత్ రమ, సుమలత, సులోచన, చిట్టెమ్మ, చిన్నక్క, నారాయణమ్మ, ఉద్యమ నాయకుడు ఎండీ మూసా పాల్గొన్నారు.
బూర్గంపహాడ్, సెప్టెంబరు 4: పోడు భూముల విషయమై సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో పోడు భూములకు పట్టాలివ్వాలని తీర్మానం చేయడంపై ఆదివాసీలు ప్రజాప్రతినిధులతో కలిసి బూర్గంపహాడ్ అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు పోడు సమస్యతో బాధపడుతున్నారన్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎం కేసీఆర్ తాజాగా క్యాబినెట్ సమావేశంలో పోడు భూములకు పట్టాలిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని తీర్మానం చేయడంపై సీఎం కేసీఆర్‌కు ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, పొడియం నరేందర్, టీఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీను, గోనెల నాని, గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి, గుల్ మహ్మద్, సాబీర్‌పాషా, పూర్ణ, సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, రవికుమార్ పాల్గొన్నారు.
ఆళ్లపల్లి, సెప్టెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రెండోవ విడుతలో భాగంగా ప్రతి మండలానికి 500మందికి ఇవ్వాలని శనివారం క్యాబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తు మండలంలోని మర్కోడు గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీకి చెందిన దళితులు కేసీఆర్, రేగా కాంతారావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ…దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్‌బాబు, పీఏసీఎస్ చైర్మన్ రామయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారావు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, యువజన నాయకుడు సతీశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు రవి, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం, సెప్టెంబరు 4: టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చి న మాట ప్రకారం పోడు రైతులకు పట్టాలు ఇస్తామని, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళితబంధు అం దిస్తామని హామీ ఇచ్చి క్యాబినెట్లో తీర్మానం చేయడం పట్ల గిరిజనులు, దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు, మహిళా నాయకులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరకగూడెం,సెప్టెంబర్ 4: దళితుల అభివృద్ధే లక్ష్యం గా శనివారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో దళితులకు దళితబంధు పథకం శరవేగంగా అందేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆదివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
రాష్ట్రంలో దళితులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు రాము, రాంబాబు, పెదరామలింగం, చిరంజీవి, వెంకటేశ్వర్లు, నేతాజీ, ఏడుకొండలు, రంజిత్ పాల్గొన్నారు.