సత్తుపల్లి, ఆగస్టు 22 : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు అన్నారు. నవభారత్ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గ్రంథాలయాల్లో సదుపాయాలను వినియోగించుకుని స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తెలుసుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నారు.
వజ్రోత్సవాలు జాతీయ సమైక్యతను పెంపొందించేలా జరిగాయని విద్యాశాఖ మండల నోడల్ అధికారి ఎన్.రాజేశ్వరరావు అన్నారు. పాతసెంటర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఎం చిత్తలూరి ప్రసాద్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, కల్లూరు రూరల్, ఆగస్టు 22 : ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వజ్రోత్సవాల ముగింపు సభకు కల్లూరు మండలం నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపుమేరకు ఎంపీపీ బీరవల్లి రఘు ఆధ్వర్యంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పలుశాఖల అధికారులు సోమవారం హైదరాబాద్ తరలివెళ్లారు.
కల్లూరు, ఆగస్టు 22 : కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వజ్రోత్సవాల ముగింపులో భాగంగా కల్లూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశనాయకుల చిత్రాలతో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీవో వీరాస్వామి, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, రైతుబంధు సమితి బాధ్యుడు లక్కినేని రఘు, ఈవో కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైరా, వైరా టౌన్, ఆగస్టు 22 : స్థానిక తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఎం.లక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి నాగేశ్వరరావు బహుమతులందజేశారు.
కామేపల్లి, ఆగస్టు, 22 : గోవింద్రాల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన. వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు ఎంపీటీసీ లకావత్ సునీత బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు వెంకటమ్మ, కార్యదర్శి బానోత్ విజయ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కారేపల్లి, ఆగస్టు 22 : వజ్రోత్సవ ముగింపు వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాలను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులకు ఎంపీడీవో చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.