సత్తుపల్లి టౌన్, ఆగస్టు 20: సింగరేణి గనుల వద్ద బాంబ్ బ్లాస్టింగ్ కారణంగా సత్తుపల్లిలో దెబ్బతిన్న ఇళ్ల యజమానులకు నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం హైదరాబాద్‌లో సీఎండీ శ్రీధర్‌ను కోరారు. బ్లాస్టింగ్ కారణంగా సత్తుపల్లిలోని వెంగళరావునగర్, జలగం నగర్, విరాట్‌నగర్, ఎన్టీఆర్కాలనీ, జగన్నాథపురం, కిష్టారం ఎస్సీ, బీసీ కాలనీతో పాటు రేజర్ల, కొత్తూరులోని కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. గనుల వద్ద బ్లాస్టింగ్ తీవ్రతను తగ్గించాలన్నారు. రేజర్లకు చెందిన కొందరు నిర్వాసితులకు పరిహారం అందలేదని, వారికి పరిహారం అందేలా చూడాలన్నారు. సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు రవాణాపై వందలాది మంది లారీ యజమానులు ఆధారపడి ఉన్నారని, వారందరికీ బొగ్గు రవాణాకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మినరల్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఈ ప్రాంతానికే ఖర్చు చేసేలా ఆదేశాలు జారీచేయాలన్నారు. సమస్యలపై సీఎండీ సానుకూలంగా స్పందించారు. అనంతరం సీఎండీ ఆధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు సమస్యలపై చర్చించారు.