ఖమ్మం రూరల్, ఆగస్టు 19: సాయం చేసే గుణం ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోలెపల్లి గ్రామంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో పాలు,పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగరత్నం, రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏసీడీపీవో వీరభద్రమ్మ, సెక్టార్ సూపర్వైజర్లు లక్ష్మి, విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఇమాం, అంగన్వాడీ టీచర్లు అక్తర్‌బేగం, పీ పుష్పలత, బీ సుహాసిని, బీ అరుణ, గ్రామదీపిక అరుణ పాల్గొన్నారు.
మధిరటౌన్, ఆగస్టు19: మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ రమాదేవి, మధిర సీఐ మురళి, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, మధిర పట్టణ ఎస్సై సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలకు, ఆర్కే ఫౌండేషన్‌లో అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. మధిర సబ్జైల్లో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చింతకాని, ఆగస్టు 19: వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హెచ్ఎంల ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు హెచ్ఎంలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు కుమ్మర నర్సింహారావు, పోటు శ్రీనివాసరావు, శోభారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మధిరరూరల్, ఆగస్టు19: నాగవరప్పాడు అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం హెల్త్మదర్, హెల్త్బేబీ షో నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోరబోయిన నాగమణి, సూపర్వైజర్ మాలతి, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.