సత్తుపల్లి, ఆగస్టు 18 : సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గురువారం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ నివాళులర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో కూడా నిర్వహించారు.
వైరా, వైరా టౌన్, ఆగస్టు 18 : వైరా మున్సిపల్ గౌడ సేవా సమితి ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ని గురువారం వైరాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, సీఐ టీ.సురేశ్, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, స్వాతంత్య్ర సమరయోధులు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, ఆగస్టు18 : బహుజనులను అధికార పీఠంపై కూర్చోబెట్టాలని 400 ఏళ్ల క్రితమే సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటాన్ని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, గౌడ్ సేవాసమితి నాయకుడు గుండ్ల నాగయ్య పిలుపునిచ్చారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా తల్లాడ రింగ్రోడ్డుసెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ మహానుభావుని ఆశయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సేవా సమితి నాయకులు బొడ్డు రామ్‌లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, మొక్కా బసవయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. గొల్లగూడెంలో పాపన్నగౌడ్ జయంతిని గణేశ్యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పెనుబల్లి, ఆగస్టు 18 : మొగలు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న జయంతిని గురువారం వీఎం బంజరులో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన చేసిన పోరాటాలను వివరించారు. కార్యక్రమంలో పంది వెంకటేశ్వర్లు, వేముల నరసింహారావు, పాల్గొన్నారు.
వేంసూరు, ఆగస్టు 18 : గీత పారిశ్రామిక సహకార సంఘ కార్యాలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గీత సహకారసంఘం అధ్యక్షుడు వాకా చెన్నారావు, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.