Assam CM | ‘జీవితమంటే రన్నింగ్ రేస్ కాదు’.. ఐఐటీ గువాహటి విద్యార్థులతో అస్సాం ముఖ్యమంత్రి
Assam CM | ఐఐటీ గువాహటి (IIT Guwahati) కి చెందిన 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ (Scholarships) లు అందించాలని అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమాంత బిశ్వశర్మ (Himanta Biswasharma) నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను, ఐఐటీ గువాహటి డైరెక్టర్‌ను ఆయన ఆదేశించారు.
Assam CM : ఐఐటీ గువాహటి (IIT Guwahati) కి చెందిన 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ (Scholarships) లు అందించాలని అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమాంత బిశ్వశర్మ (Himanta Biswasharma) నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను, ఐఐటీ గువాహటి డైరెక్టర్‌ను ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ 1న జరిగిన ఐఐటీ గువాహటి 33 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ గువాహటి కేవలం విద్యలో ప్రతిభ చూపించే సంస్థ కాదని.. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ఐఐటీ గువాహటి విద్యార్థుల కోసం అస్సాం ప్రభుత్వం 100 స్కాలర్షిప్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరగా అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను, ఐఐటీ గువాహటి డైరెక్టర్‌ను కోరారు. అస్సాం ఎదుర్కొనే సంక్లిష్టమైన సాంకేతిక, అభివృద్ధి సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో ఐఐటీ గువాహటి కీలకపాత్ర పోషిస్తుందని హిమంత బిశ్వ శర్మ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగానే ఐఐటీ గువాహటి విద్యార్థులకు సీఎం ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు.
జీవితం పరుగు పందెం కాదని, మీరు అందరికంటే వేగంగా ముందుకు వెళ్లకపోయినా పర్వాలేదని హిమాంత అన్నారు. దానివల్ల మీరు వెనుకబడినట్లు భావించాల్సిన అవసరం లేదని సీఎం హిమంత బిశ్వశర్మ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

