కారేపల్లి, జూలై 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో దళారీలకు చోటు లేదని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రభుత్వ ఫలాలను నేరుగా అందుకుంటున్నారన్నారు. అన్ని వర్గాలకు సముచిన న్యాయం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మోడీ పాలనలో ప్రజానీకం ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. తొలుత తులిశ్యాతండా,బీక్యాతండాలలో ఇటీవల మృతి చెందిన వారి ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీను, వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత దేవాలయ చైర్మన్ మల్లేల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, సర్పంచ్‌లు అజ్మీరా అరుణ, బానోత్ కుమార్, ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, అడ్డగోడ ఐలయ్య, ఎం.డీ.హనీఫ్, పప్పుల నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్స్టేడియానికి నిధులు మంజూరు
వైరాలో ఇండోర్‌స్టేడియంలో మౌలిక వసతుల నిమిత్తం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్కోటి 92 లక్షలను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన మంజూరు కాపీని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సంబంధిత అధికారులకు గురువారం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, క్రీడామంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు, క్రీడాకారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్‌చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీ డీ కే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీ కోఆప్షన్‌సభ్యులు షేక్ లాల్‌మహ్మద్, వైరా పట్టణ, రూరల్ అధ్యక్షుడు ధార్నా రాజశేఖర్, బాణాల వెంకటేశ్వరరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు మిట్టపల్లి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్‌రావు, చేపల సొసైటీ అధ్యక్షుడు షేక్ రెహమాన్, ఆలయ చైర్మన్లు పోలా శ్రీనివాసరావు, మోరంపూడి బాబు, నాయకులు మోటపోతుల సురేశ్, కన్నెగంటి హుస్సేన్, మాధవరావు, షేక్ గని తదితరులు పాల్గొన్నారు.