కూసుమంచి, జూలై 21: విజన్ కలిగిన సీఎం.. కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆందుకే ఆయన వ్యవసాయం, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. సమైక్య పాలకులకు ముందుచూపు లేక ఒక్క పంటకూ సాగు నీటిని సక్రమంగా అందించేవారు కాదని విమర్శించారు. సీఎం కేసీఆర్ చొరవ వల్లే ఇప్పుడు రెండు పంటలకూ పుష్కలంగా నీళ్లందుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం వానకాలం పంటల కోసం పాలేరు ప్రధాన కాలువ గేట్ల వద్ద స్విచ్ ఆన్ చేసి ఆయకట్టు రైతులకు గురువారం నీటిని విడుదల చేశారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 2.5 లక్షల ఎకరాల మాగాణికి నీటిని అందిస్తామని అన్నారు.
సాగర్ ఆయకట్టు కింద ఉన్న ప్రతి ఎకరాకూ మొదటి పంటకు పూర్తిగా నీరు అందుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. సాగర్ నీరు ఇంకా వదలకపోయినా రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు వానకాలం పంటల కోసం నెల రోజుల ముందుగానే నీటిని విడుదుల చేస్తున్నట్లు ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. పంటలకు కలిసి వచ్చే విధంగా నీటిని ఇవ్వటానికి అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముందస్తుగా సాగు నీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ఉపయోగమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సాగర్ అధికారులు సాగునీటి ప్రణాళిక విషయంలో లంకాసాగర్, బేతుపల్లి నుంచి నీటి విడుదలకు తగిన ప్రణాలిక తీసుకోవాలని అన్నారు.
కానీ ముందు ఆయకట్టు నుంచి ప్రమాణికంగా తీసుకోవద్దని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. దీంతో రైతులు అన్నీ రకాలుగా అనందంగా ఉన్నారని అన్నారు. ఆయకట్టు చివరి రైతులకూ సకాలంలో నీరందేలా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, నల్లమల వెంకటేశ్వరరావు, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, బాణోత్ శ్రీనివాస్, బెల్లం ఉమ, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, యండపల్లి వరప్రసాద్, నెల్లూరి లీలాప్రసాద్, వడ్తియా సేట్రాంనాయక్, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు, పాషబోయిన వీరన్న, శంకర్‌నాయక్, నర్సింహారావు, సమ్మిరెడ్డి, రమేశ్‌రెడ్డి, మీనన్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.