సత్తుపల్లి రూరల్, జూలై 19 : ప్రస్తుత ఆధునిక సమాజంలో అడుగంటిపోతున్న భూగర్భజలాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రీతమ్‌సింగ్ అన్నారు.మంగళవారం కిష్టారం, చెరుకుపల్లి గ్రామాల్లో నిర్మించిన ఫారంపాండ్లు, ఇంకుడుగుంతలు, ట్రెంచ్‌లను పరిశీలించి మాట్లాడారు. భూగర్భజలాలను ప్రతిబొట్టు ఒడిసిపట్టి వాటిని నీటిలో ఇంకింపచేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో అమృత్‌సరోవర్ పేరిట నీటిగుంటలను ఉచితంగా తవ్వించి వారికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కిష్టారం, చెరుకుపల్లిలోని పల్లెప్రకృతివనాలు, బృహత్‌పల్లెప్రకృతి వనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కిష్టారంలో హరితహారంలో భాగంగా బృహత్ పల్లెప్రకృతివనం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యుడు సుధీర్‌కుమార్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, అడిషనల్ పీడీ శిరీష, ఏపీడీ వెంకటరాజు, ఎంపీడీవో వీరేశం, ఎంపీపీ దొడ్డా హైమావతి, సర్పంచ్‌లు చెట్టుమాల రేణుక, ఇర్పా లలిత, ఉపసర్పంచ్ ధనుంజయరావు, ఎంపీటీసీలు పాలకుర్తి సునీత, ఇర్పా కృష్ణారావు, ఏపీవో బాబూరావు, కార్యదర్శులు రవి, అంజి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
కల్లూరు రూరల్, జూలై 19 : కల్లూరు మండలం పడమర లోకవరం పంచాయతీలో అటవీప్రాంతంలో అస్థిర కందకాలు, 2019-20 అవెన్యూ ప్లాంటేషన్‌ను జలశక్తి అభియాన్ కేంద్ర బృందం మంగళవారం పర్యటించి పరిశీలించింది. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రీతంసింగ్, డీఆర్డీవో పీడీ విద్యాచందన, అడిషనల్ డీఆర్డీవో డి.శిరీష, ఎంపీపీ బీరవల్లి రఘు, సర్పంచ్ కల్యాణపు వెంకటేశ్వరరావు, ఎంపీడీవో రవికుమార్, ఎఫ్ఆర్వో, ఎఫ్‌డీవో, ఏపీవో, ఈసీ, పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
వేంసూరు, జూలై 19 : కేంద్ర జలశక్తి అభియాన్ బృందం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ప్రీతమ్ సింగ్, జల్‌శక్తి అభియాన్ శాస్త్రవేత్త సుధీర్‌లు పర్యటించి మండలంలో రైతులు సాగు చేస్తున్న కరివేద పద్దతిని తెలుసుకున్నారు.