సత్తుపల్లి టౌన్, జూలై 16: సీఎం కేసీఆర్‌తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకం అమలవుతోందని అన్నారు. మండలంలోని కిష్టాపురం గ్రామంలో 25 మందికి మంజూరైన యూనిట్లను ఆర్డీవో సూర్యనారాయణతో కలిసి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 100 యూనిట్లు మంజూరు కాగా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో 75 మందికి, సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో 25 మందికి శనివారంతో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు చెప్పారు. అత్యధిక మంది లబ్ధిదారులు ట్రాక్టర్లు, జేసీబీలు వంటి యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోగా 27 మంది లబ్ధిదారులు డెయిరీ ఫాంలను ఎంచుకున్నట్లు చెప్పారు. కొందరు నాయకులు చేస్తున్న అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
కాంపోజిట్ సిలిండర్లు.. ప్రమాదరహితం..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వినియోగదారుల రక్షణ సౌకర్యార్థం ప్రవేశపెట్టిన కాంపోజిట్ సిలిండర్లు ప్రమాద రహితమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కాంపోజిట్ సిలిండర్లను ఆయన శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. తక్కువ బరువుతో పూర్తిస్థాయి రక్షణతో కూడిన ఈ సిలిండర్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఉంటుందన్నారు. స్థానిక వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ డీలర్ వందనపు మంజుల మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ సిలిండర్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయని అన్నారు. దొడ్డా హైమావతి, కూసంపూడి రామారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, యాగంటి శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, సత్యనారాయణ, సుజలారాణి, సుజాత, వాసు, మందపాటి పద్మజ్యోతి, మట్టా ప్రసాద్, మల్లూరు పద్మావతి, దూదిపాళ్ల రాంబాబు, రఘు, అనిల్, గఫార్ పాల్గొన్నారు.