మామిళ్లగూడెం, జూలై 7: హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. వర్షాలు ప్రారంభమైనందున ఈ నెల ఆఖరులోగా మొకలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి హరితహారం కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల్లోనూ వర్షపాతం నమోదైందని, కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం ఉందని అన్నారు. 8వ విడత హరితహారం అమలుకు ఇది మంచి సమయమని, ఇప్పుడు మొకలు నాటితే మనుగడ శాతం ఎకువగా ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం హరితహారం కింద 50 లక్షల మొకలు నాటడాన్ని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఎఫ్‌డీవోలు ప్రకాశ్‌రావు, సతీశ్‌కుమార్, డీఏవో విజయనిర్మల, డీపీవో హరిప్రసాద్, అదనపు డీఆర్డీవో శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
త్రైమాసిక తనిఖీల్లో బాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వీపీ గౌతమ్ గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన హాల్‌ను పరిశీలించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, కలెక్టరేట్ ఏవో మదన్‌గోపాల్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి
జిల్లాలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, ఉపాధి హామీ, మేజర్ గ్రామ పంచాయతీల్లో పనుల పురోగతిపై కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 753 తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు 402 చోట్ల గ్రౌండింగ్ చేయగా.. 225 క్రీడా ప్రాంగణాలు పూర్తయినట్లు చెప్పారు.
వనరులను వినియోగించుకోవాలి
జిల్లాలోని యువత ఉపాధి అవకాశాలతోపాటు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లా స్కిల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధుకు సంబంధించి నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా ఉపాధికి ఎక్కువ అవకాశాలు, డిమాండ్ ఉన్న పనులపై యువతకు చైతన్యం కలిగించాలని, ఆయా పనుల్లో పోటీకి అనుగుణంగా నైపుణ్యం పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా అధికారులు శ్రీరామ్, విజయనిర్మల, జ్యోతి, విద్యాచందన, మహమూది, చంద్రశేఖర్, శ్రీనివాస్, కస్తాల సత్యనారాయణ, కిషన్‌రావు, అజయ్‌కుమార్, మీనాక్షి, విజేత తదితరులు పాల్గొన్నారు.