రఘునాథపాలెం, శివాయిగూడెం, మంచుకొండలో పల్లె ప్రగతి పనులకు శ్రీకారం
ఖమ్మం/ రఘునాథపాలెం, జూన్ 17:రఘునాథపాలెం అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం, శివాయిగూడెం, మంచుకొండ గ్రామాల్లో ఆయన శుక్రవారం ‘పల్లె ప్రగతి’లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటి జాగ ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. ‘పల్లె, పట్టణ’ ప్రగతి నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు.
ఇంటి జాగ ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. మండలంలో అర్హులైన ప్రతి నిరుపేదకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’లో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని రఘునాథపాలెం, శివాయిగూడెం, మంచుకొండ గ్రామాల్లో పర్యటింటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లకు ముందున్న రఘునాథపాలెం మండలానికి, ఇప్పటి రఘునాథపాలెం మండలానికి అభివృద్ధిలో ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోనే ఏకైక నూతన మండలమైన రఘునాథపాలెం.. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్..
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని, అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందిన వారికి ఈ పథకం ఎంతో దోహదపడుతోందని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తన సిఫార్సు ద్వారా 66 మందికి మంజూరైన రూ.29.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సిఫార్సు మేరకు ఇప్పటి వరకు 2,901 మంది లబ్ధిదారులకు రూ.12.04 కోట్ల ఆర్థిక సాయం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైందని వివరించారు.
ప్రతి డివిజన్లో క్రీడా ప్రాంగణాలు
నగరంలోని ప్రతి డివిజన్‌లోనూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం 6వ డివిజన్ ప్రశాంతినగర్‌లో పట్టణ ప్రకృతి వనాన్ని, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడా ప్రాంగణంలో పిల్లల ఆడకునేందుకు రూ.1.50 లక్షలతో ఆట వస్తువులను సమకూర్చిన టీఆర్ఎస్ నాయకుడు సరిపూడి సతీశ్‌ను మంత్రి ఈ సందర్భంగా సత్కరించి అభినందించారు. కేంఎసీ కమిషనర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.