మణుగూరు రూరల్, జూన్ 8: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కమ్యూనిటీ హాల్ సకల హంగులతో కార్మికుల కుటుంబాలకు అందుబాటులోకి వచ్చింది. పీవీ కాలనీలో ఏసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ అది కాగితాలకే పరిమితమైంది. టీబీజీకేఎస్ నేతలు పలు సందర్భాల్లో సింగరేణి సీఎండీతోపాటు పలువురు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు అంగీకరించడంతో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాల్‌ను సకల హంగులతో ఏసీ కమ్యూనిటీ హాల్‌గా రూపుదిద్దారు. ఆధునీకరణ పనులు మొత్తం పూర్తయ్యాయి.
కార్మిక కుటుంబాల హర్షం
రూ.19 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్‌కు 12 ఏసీలు, గదులకు రెండు ఏసీలు, ఆర్మ్స్మ్రామ్ సీలింగ్, ఫ్లోర్ టైల్స్, అల్యూమినియం గ్లాస్ తలుపులు, డైనింగ్‌హాల్, కలరింగ్, నెలన్నరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం సింగరేణిలోనే అత్యాధునిక సౌకర్యాలతో విశాల ప్రదేశంలో ఉన్న కమ్యూనిటీ హాల్ మణుగూరులో కార్మిక కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన కార్పొరేట్ స్థాయిలో ఏసీ కమ్యూనిటీహాల్ సౌకర్యాలు చూసి కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ చార్జీలతో శుభకార్యాలు జరుపుకునే కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా సాధారణ ధరలకు అందుబాటులోకి తీసుకురావడంపై టీబీజీకేఎస్ నేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఉత్పత్తి ఉత్పాదకల్లో ఎప్పుడూ ముందుండే మణుగూరు ఏరియాలో పీవీకాలనీలోని కమ్యూనిటీహాల్‌ను ఏసీ కమ్యూనిటీహాల్గా ఆధునీకరించాలనే టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ మేరకు స్పందించి కార్మికుల సౌకర్యార్థం కార్మిక కుటుంబాలు జరుపుకునే శుభకార్యాలకు ఏసీ కమ్యూనిటీహాల్గా మార్చడం అభినందనీయం. సింగరేణి సీఎండీ శ్రీధర్, డైరెక్టర్(పా) బలరాం, ఏరియా జీఎం జక్కం రమేశ్‌కు యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– వీ.ప్రభాకర్‌రావు, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు