సత్తుపల్లి రూరల్, మే 26:కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. మరుసటి రోజు అత్తారింట్లో జరిగే శుభకార్యానికి తల్లి, భార్య, అత్తలతో కలిసి కారులో ఆనందంగా బయలుదేరాడు. కానీ మృత్యువు మరో కారు రూపంలో వారిని వెంటాడింది. వివాహమైన 24 గంటల్లోనే తండ్రి, నాయనమ్మ మృతిచెందడంతో పెళ్లింట విషాదం అలుముకుంది. నవ వధువు, ఆమె కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. ఆనందంగా గడపాల్సిన కుటుంబాలు విషాదాన్ని మూటగట్టుకున్నాయి.
కారు ఢీకొని తల్లీకొడుకు..
సత్తుపల్లి పట్టణంలోని మెట్టాంజనేయస్వామి ఆలయ సమీపంలో గురువారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన వడాలి భానుమతి, వడాలి రంగరాజు తల్లీకొడుకులు. బుధవారం రాత్రి కపిలేశ్వరపురం లో రంగరాజు కుమార్తె నవ్య వివాహం సత్తుపల్లికి చెం దిన అబ్బాయితో జరిగింది. వివాహమైన మరుసటి రోజున వరుడి ఇంట్లో వేడుకకు భానుమతి, ఆమె కొడు కు రంగరాజు, కోడలు రమ, వియ్యపురాలు (రమ తల్లి) దేవినికొండ నాగమణి కలిసి కారు(ఏపీ07 ఏఎస్1166)లో సత్తుపల్లి వస్తున్నారు. సత్తుపల్లి జూనియర్ కళాశాల అధ్యాపకులు భాగ్యలక్ష్మి, జెబీనా, కల్పన, రఘునందన్, సాంబశివరావు కలిసి వేంసూరు మం డ లం వెంకటాపురంలో శుభకార్యానికి కారు(టీఎస్04 ఈఎస్3827)లో వెళ్తున్నారు.
అధ్యాపకులు ఉన్న కా రు.. మెట్టాంజనేయ స్వామి ఆలయ సమీపంలో ముం దున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా కృష్ణా జిల్లా నుంచి వస్తున్న కారును ఢీకొంది. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వడాలి భానుమతి(80), వడాలి రంగరాజు(56) కు తీవ్ర గా యాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న అధ్యాపకు లు రఘునందనరావు, కల్పన, భాగ్యలక్ష్మికి స్వల్ప గా యాలయ్యాయి. వారు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చి కిత్స పొందుతున్నారు. మృతిచెందిన భానుమతికి నలుగురు కుమారులు ఉన్నారు. రంగరాజుకు భార్య రమ, కుమార్తె ఉన్నారు. భానుమతి కుమారుడు శేషంరాజు ఫి ర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహమైన 24 గంటల్లోపే పెళ్లి కుమార్తె తండ్రి, నాయన మ్మ దుర్మరణంతో ఆ పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లి కుమార్తె, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు..
ముదిగొండ మండలం గోకినేపల్లి సమీపంలో గురువారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(55), కుమారుడు ఉపేందర్, మనవడు హర్షవర్దన్(8) కలిసి ముదిగొండ మండలం మేడేపల్లిలోని బంధువుల ఇంట గురువారం దశదిన కర్మకు హాజరయ్యారు. సాయంత్రం తమ బంధువులకు చెందిన ఆటోలో నేలకొండపల్లికి బయల్దేరారు.
ఇదే ఆటోలో సింగరేణి మండలం కొత్తకమలాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చాగంటి రమేష్(35), మరొకరు కూడా ప్రయాణిస్తున్నారు. గోకినేపల్లి శివారులో ఈ ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న భారతమ్మ, హర్షవర్దన్, రమేష్ అక్కడిక్కడే మృతిచెందారు. ఉపేందర్, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. చనిపోయిన భారతమ్మ నిరుపేద కూలీ. వీరి స్వగ్రామం నేలకొండపల్లిలో విషాదం నెలకొంది.