మామిళ్లగూడెం, మే 26: ప్రజల భద్రతకు రక్షణ కవచంలా పని చేయాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. పోలీస్ రక్షణ చర్యల్లో భాగంగా గురువారం లకారం ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. లకారం ట్యాంక్‌బండ్‌పై సందర్శకులు అధిక సంఖ్యలో పర్యటిస్తారు కాబట్టి సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని సూచించారు. దాంతోపాటు పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్, షీటీమ్ బృందాలు పెట్రోలింగ్ చేయాలని సూచించారు. లకారంలో పడి మృతిచెందిన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని, రోడ్లపై మద్యం తాగి ఇతరులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ సుభాశ్‌చంద్రబోస్, ఏసీపీలు ఆంజనేయులు, రామోజీ రమేశ్, ప్రసన్నకుమార్, సీఐలు చిట్టిబాబు, అంజలి, శ్రీధర్, రామకృష్ణ, సర్వయ్య, సత్యనారాయణరెడ్డి, ఉదయ్ పాల్గొన్నారు.