సత్తుపల్లి, మే 24: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేసిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదరరావును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కలిశారు. ఈ మేరకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఉన్నారు.