కల్లూరు, సత్తుపల్లి టౌన్, వేంసూరు, పెనుబల్లి, మే 4 : రాజకీయ నాయకులు అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కల్లూరు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన జలగం శతజయంతి వేడుకలకు ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జలగం వెంగళరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జలగం తన రాజకీయ జీవితానికి ఎంతో దోహదపడ్డారని కొనియాడారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఈ ప్రాంత రాజకీయాలకు జలగం వెంగళరావు చిరునామాగా మారారని, ఆయన హయాంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తొలుత జలగం వెంగళరావు సమకాలీకుడు మండల పరిధిలోని పోచవరం గ్రామానికి చెందిన దేవభక్తుని గోపాలరావును శాలువాతో తుమ్మల సత్కరించారు.
కార్యక్రమంలో శతజయంతి ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు బూదాటి నారపరెడ్డి, సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తోటకూర శేషగిరిరావు, పసుమర్తి మోహనరావు, అన్నం రాజు, శ్రీమన్నారాయణ, వల్లభనేని భాస్కరరావు, పాలెపు రామారావు, కట్టా అజయ్‌బాబు, బీరవల్లి రఘు, పసుమర్తి చందర్రావు, జలగం అభిమానులు పాల్గొన్నారు. సత్తుపల్లిలోని జలగం వెంగళరావు పార్కు వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. వేంసూరులో వెంగళరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లచ్చన్నగూడెం గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వెంకటాపురం, కుంచపర్తి గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఉడతనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చల్లగుళ్ల కృష్ణయ్య, దొడ్డా హైమావతీ శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, దొడ్డా వెంకటేశ్వరరావు, తుంబూరు కృష్ణారెడ్డి, గోదా నర్సింహారావు, తోట నాగరాజు, మల్లవరపు శ్రీనివాసరావు, చెక్కిలాల లక్ష్మణరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, జలగం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన శతజయంతి వేడుకల్లో ప్రిన్సిపాల్ పానెం రామచందర్‌రావు, అధ్యాపకులు పాల్గొన్నారు. పాలా వెంకటరెడ్డి, నాయకులు మారోజు సురేశ్, గొర్ల శ్రీనివాసరెడ్డి, నున్నా రాంబాబు, నాయకులు పాల్గొన్నారు.పెనుబల్లిలో జరిగిన జలగం వెంగళరావు శతజయంతిని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వంకాయలపాటి వెంకటేశ్వరరావు, రామారావు, మంగూనాయక్, వెంకటేశ్వర్లు, మాలోతు రాధాకృష్ణ, గోపియాదవ్, జెన్నారెడ్డి నర్సింహారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, కర్నాటి వీరభద్రారెడ్డి, కరీముల్లా, హనుమంతరావు, శీలం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.