తల్లాడ, మే 2: పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, దరఖాస్తు చేసుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి సహాయనిధిని మంజూరు చేస్తూ పేదల మదిలో చెరుగని ముద్ర వేసుకున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తల్లాడ రైతువేదికలో 59 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.30,30,300 చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అనారోగ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో పడుతోందని అన్నారు. ఈ నెల 4న ఖమ్మంలోని గోశాలకు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 200 ట్రాక్టర్ల ద్వారా వరిగడ్డిని వితరణగా అందిస్తున్నట్లు తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, యూసూఫ్, అయిలూరి ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్లూరులో..: కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ బీరవల్లి రఘు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని 50 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.25,05,400 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కట్టా అజయ్‌బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, ఇస్మాయిల్ పాల్గొన్నారు.