సత్తుపల్లి రూరల్, మే 2 : మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని కొత్తూరులో ముస్లిం కుటుంబాలకు టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిత్యావసరాలను పంపిణీ చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు చేయూతనందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గొర్లమారి రామ్మోహనరెడ్డి, కొప్పుల నరేందర్‌రెడ్డి, మేకా సతీశ్‌రెడ్డి, దేశిరెడ్డి సావిత్రి, వెంకట్రామిరెడ్డి, నంద్యాల సంజీవరెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ విస్సంపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మారెడ్డి బ్రదర్స్, సాధు శివ, ఖాసింతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.
దగ్ధమైన రెస్టారెంట్నుపరిశీలించిన ఎమ్మెల్యే
తాళ్లమడ గ్రామ సమీపం లోని దీక్షిత రెస్టారెంట్‌పై ఆదివారం రాత్రి పిడుగుపడి దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర ఆ రెస్టారెంట్‌ను పరిశీలించి యజమాని రవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, నాయకులు కూసంపూడి మధు, మేకల నర్సింహారావు, వేములపల్లి మధు, గాదె సురేశ్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
సత్తుపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల మృతిచెందారు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం హాజరై శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబసభ్యులకు సంతాపం, సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, లక్ష్మాచారి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు.
వేంసూరు, మే 2 : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం మండలంలో పర్యటించారు. లింగపాలెం గ్రామంలో ఉపసర్పంచ్ యర్రా రమేశ్ తండ్రి యర్రా కృష్ణయ్యను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు పాలా వెంకటరెడ్డి, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, రాంబాబు, కొండపల్లి రాంబాబు, ఇనుగండ్ల సత్యనారాయణ, సింగపోగు ప్రసాద్, సురేశ్, ప్రసాద్, రవి, పుల్లారావు, రాంబాబు, శ్రీనివాసరావు, వంట్ల చంటి తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
కిష్టాపురం గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, కూసంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు
ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మసీదులో ముస్లింలకు సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇఫ్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమంలో ముస్లింలకు పండ్లు అందజేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూసంపూడి మహేశ్, తోట సుజలరాణి, చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్‌పాషా, మట్టా ప్రసాద్, నడ్డి ఆనందరావు, మదీనా బాషా, సర్దార్, జాని, రఫీ, చల్లగుళ్ల కృష్ణయ్య, మున్వర్ హుస్సేన్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.