ఎర్రుపాలెం, మే 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనదేనని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. ఆదివారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి సీఎం కేసీఆర్ అన్నిరకాలుగా ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించినప్పటికీ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ కుడుముల మధుసూదన్‌రెడ్డి తన తల్లి వెంకటనర్సమ్మ జ్ఞాపకార్థం ముస్లింలకు జడ్పీ చైర్మన్ చేతుల మీదుగా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచులు అనురాధ, అప్పారావు, భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, రైతుబంధు సమితి సభ్యురాలు రామిశెట్టి సుజాత, యూత్ అధ్యక్షుడు సాంబశివరావు, ఎంపీటీసీ కిశోర్, హుస్సేన్, భాషా, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.