సత్తుపల్లి, ఏప్రిల్ 28 : రంజాన్ పురస్కరించుకుని మండలంలోని మసీదుల్లో పనిచేస్తున్న మౌలీ సాబ్, మౌజాన్లకు అమ్మ, ఆషాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రంజాన్ తోఫా, దుస్తులు, రూ.2వేల నగదును మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ, ఆషాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రంజాన్ వేడుకలను నిర్వహించడం, ఉపవాస దీక్షలు ఉన్న వారికి ఇఫ్తార్ విందు ఇస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ఆషాఖాన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జామే మసీదు సదర్ ముక్రమ్, బిస్మిల్లా మౌలాలీ, లాయర్ భాషా, బుడేన్, కిజర్, మహమ్మద్, రఫీ, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, మిద్దె శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అన్ని మతాల సారాంశం ఒక్కటే ..
సత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 28 : సర్వమత సమ్మేళనానికి తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిచిందని, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ పాషా అన్నారు. గంగారం మసీదులో బుధవారం రాత్రి ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో అన్ని పండుగలను గౌరవించి, ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జరుపుకోవడం హర్షణీయమన్నారు. అనంతరం మసీదు కమిటీ సభ్యులు కమాండెంట్ సయ్యద్ జమీల్ పాషా, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.