ఖమ్మం నగరంలో దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 26: రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరిపై ఖమ్మంలో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్ ఎదుట రేణుకచౌదరి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం జిల్లా ప్రజల శ్రేయస్సు కోరే పువ్వాడ అజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆరుద్ర పురుగులాగా సీజన్లో వచ్చి కొంగ జపం చేసే రేణుకాచౌదరి నైజం జిల్లా ప్రజలకు బాగా తెలుసనన్నారు. ఉనికి కోల్పేయే దశకు చేరిన కాంగ్రెస్‌ను చూసి ఆ పార్టీ నాయకులే మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేయర్ నీరజ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రాపర్తి శరత్, కర్నాటి కృష్ణ, బుడిగం శ్రీను, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, వీరూనాయక్ పాల్గొన్నారు.
గోపాలపురంలో శవయాత్ర..
రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఖమ్మంలోని 8వ డివిజన్ గోపాలపురం, ఎల్బీనగర్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రేణుకాచౌదరి వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమెను జిల్లాలో అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. సురేశ్, దేవభక్తుని కిశోర్‌బాబు, వీరేందర్, రమేశ్, ఈశ్వర్, సతీశ్, నాగమణి, పుష్ప, రేష్మా, సుమలత, భవానీ, సావిత్రి పాల్గొన్నారు.