ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 26: పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్దదిక్కుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని తల్లంపాడు, పొన్నెకల్, మద్దులపల్లి, గుదిమళ్లలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి చెక్కులు అందజేశారు. స్వరాష్ట్ర సాధన తర్వాత ఏ ఒక్క కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నిరుపేదల ఇంట్లో ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్నారన్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తొలగిందన్నారు. ఆడపిల్లల వివాహానికి సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, నాయకులు అక్కినపల్లి వెంకన్న, శంకర్ పాల్గొన్నారు.