వైరా, మార్చి 24 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు నిరంకుశ విధానాలను అవలంబిస్తూ రైతుల పాలిట శాపంగా మారిందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యులు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు తాతా మధుసూదన్‌రావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. క్యాంపు కార్యాలయం లో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా రైతాంగ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ ముందుకెళ్తుంటే బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వారిని సంక్షోభానికి గురిచేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సహాజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నందని పేర్కొన్నారు. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నదన్నారు. పెంచిన ధరలు తగ్గించకుంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తొలుత వైరా క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి వైరా రోడ్డుసెంటర్లోగ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్‌చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీ డీ కే రత్నం, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, పీఏసీఎస్ గార్లఒడ్డు చైర్మన్ చెట్టుపల్లి వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ గోకవరం చైర్మన్ చెరుకుమల్లి రవి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు ఎస్ కే లాల్మొహ్మద్, కొణిజర్ల జడ్పీటీసీ పోట్ల కవిత, వైరా ఎంపీపీ పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, పలు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, చిరంజీవి, బాణోత్ సురేశ్, తోటకూర రాంబాబు, దార్న రాజశేఖర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్లు కిలారు మాధవరావు, వీరభద్రం, గుగులోత్ శ్రీను, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.