భద్రాచలం, ఏప్రిల్ 18: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి అనంతరం మాట్లాడారు. వినతులను సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఆదివాసీలు స్వయం ఉపాధి, పోడు భూముల సమస్యలు, ట్రైకార్ రుణాలు, వ్యవసాయ రుణాలతో పాటు వ్యక్తిగత సమస్యలపై వినతులు అందివ్వొచ్చన్నారు.
మోటార్లు బిగించాలి
భద్రాచలం, ఏప్రిల్ 18: గిరి వికాసం పథకానికి ఎంపికైన వారి పొలాల్లో ఈ నెలాఖరులోపు బోరు, మోటర్లు బిగించాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను పరిశీలించి త్వరితగతిన ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్వో సురేశ్‌బాబు, ఏపీవో అనురాధ పాల్గొన్నారు.